Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రకటించినప్పుడు ప్రతి రాష్ట్రంలో చర్చ మొదలవుతుంది. ఆ భాష సినిమా కన్నా.. మన సినిమా ఏం తక్కువ.. మనకెందుకు ఇవ్వలేదు. ఆ లాంగ్వేజ్‌ హీరో కంటే మన హీరో ఏం తక్కువ.. మనోడికి ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న వస్తుండేది. ఈసారి కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు మన పక్క పరిశ్రమ కోలీవుడ్‌లో మరో చర్చ మొదలైంది. ఉత్తమ చిత్రం (తమిళం) కేటగిరీలో ‘రాయన్‌’ సినిమాకు అవార్డు రావడమే దీనికి కారణం.

Kollywood

జాతీయ అవార్డుల మీద అసంతృప్తి రాగం దేశం మొత్తం మీద ఎలా ఉన్నా.. తమిళనాట ఎక్కువగా వినిపిస్తోంది. కెరీర్‌ బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చిన నటుల సినిమా, ఇండస్ట్రీలో కల్ట్‌ కష్టం పడ్డ సినిమాలు వదిలేసి.. సగటు యాక్షన్‌ సినిమాకు ఎలా ఇస్తారు అనేది తమిళ తంబీల ఆవేదన. అవార్డుల ఎంపిక విధానం మీద అవగాహన లేనివారైతే ఫ్లాప్‌ సినిమాకు ఎలా ఇస్తారు అవార్డు అని అంటున్నారు. ఆ విషయం వదిలేస్తే.. ‘రాయన్‌’ సినిమాకు ధనుష్‌ అండ్‌ కో. పడ్డ కష్టం కంటే ఎక్కువ పడి, అలరించిన సినిమాలను వదిలేయడం వారికి నచ్చడం లేదు.

ముఖ్యంగా విక్రమ్‌ జీవించేశాడు ఆ పాత్రలో అంటూ ‘తంగలాన్‌’ గురించి మెచ్చుకోని వారు లేరు. నిజానికి ఈ సినిమాకు వస్తుందని అందరూ అనుకున్నారు. కథ, కథనం, పాత్రల చిత్రణ.. అన్నీ జాతీయ అవార్డు రావడానికి అర్హమైనవే. ఎలాగూ జాతీయ ఉత్తమ చిత్రం రాలేదు. కనీసం జాతీయ ఉత్తమ చిత్రం (తమిళం) అవార్డు అయినా ఇస్తారనుకుంటే అదీ ఇవ్వలేదు. దీంతో అవార్డుల ఎంపిక విధానంపై మరోసారి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలా అని ‘రాయన్‌’ కోసం ధనుష్‌ పడ్డ కష్టాన్ని ఎవరూ తక్కువ చేయడం లేదు.

అన్నట్లు.. ఈ మధ్య ‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ ‘‘అవార్డులు తెచ్చుకోవడానికి రకరకాల దారులు ఉన్నాయి’’ అని అన్నారు. ఆయన ఏ ఉద్దేశంలో అన్నారో కానీ.. ఇప్పుడు జాతీయ అవార్డుల విషయంలో విమర్శలు రావడంతో ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus