భాగమతిని విమర్శిస్తున్న జాతీయ మీడియా!

  • January 28, 2018 / 09:48 AM IST

బాహుబలి కంక్లూజన్ దేశవ్యాప్తంగా భారీ కలక్షన్స్ సాధించడంలో పరోక్షంగా మీడియా కూడా కారణమైంది. తెలుగు సినిమా గొప్పదనం గురించి బాగా వివరించి చెప్పింది. అంతేకాకుండా బాహుబలిలో నటించిన నటీనటులను అభినందిస్తూ కథనాలను ప్రచురించింది. ప్రసారం చేసింది. ఇందువల్ల ప్రభాస్ తో పాటు అనుష్క ఎక్కువమందికి తెలిసింది. బాహుబలి తర్వాత ఆమె చేసిన మూవీ అనగానే అభిమానులతో పాటు, మీడియా కూడా ఎక్కువ అంచనాలను పెట్టుకుంది. నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన భాగమతి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ సింగిల్ గా రాకపోవడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

తమిళం, హిందీలోనూ భాగమతి ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. అనుష్క అభిమానులకు ఈ మూవీ నచ్చింది. అయితే జాతీయ మీడియా మాత్రం విమర్శలు చేస్తోంది. అంచనాకి తగ్గట్టు మూవీ లేదని, ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉన్నా,  సెకండాఫ్ నెమ్మదించడంతో “భాగమతి”  సూపర్ హిట్ మూవీ  అని చెప్పలేమంటూ సమీక్షలు రాస్తున్నాయి. అనుష్క నటనలో లోపం లేదని దర్శకుడు అశోక్ ని తప్పుపడుతూ కథనాలు రాస్తున్నాయి. అయితే  రివ్యూ లను పక్కన పెట్టి ఈ వీకెండ్ భాగమతిని చూడాలని దేశవ్యాప్తంగా అభిమానులు ఫిక్స్ అయిపోయినట్లు టికెట్ బుకింగ్ సైట్లు స్పష్టం చేస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus