గ్రామీణ ప్రాంతంలో జరిగే కథకు ఓకే చెప్పిన నాని

  • October 16, 2018 / 07:47 AM IST

నేచురల్ స్టార్ నాని చిన్న కథలతో భారీ హిట్ అందుకున్నారు. మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించు కున్నారు. అయితే రొటీన్ కథలు బోర్ కొట్టడంతో రూట్ మార్చారు. అక్కినేని నాగార్జునతో కలిసి “దేవదాస్” అనే మల్టీ స్టారర్ మూవీ చేశారు. తొలిసారి చేసిన మల్టీ స్టారర్ మూవీ మంచి ఫలితాన్ని ఇచ్చింది. అందుకే వినూత్న కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం “జెర్సీ” అనే స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నారు. “మళ్ళీ రావా” ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.

ఇందులో నాని మూడు షేడ్స్ చూపించబోతున్నారు. దీని తర్వాత కూడా విభిన్నమైన కథకి ఓకే చెప్పినట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు. కిషోర్ అనే యువ దర్శకుడు నానికి కలిసి ఒక కథ చెప్పారంట. ఈ కథ పూర్తిగా గ్రామీణ వాతావరణంలో కొనసాగుతుందని సమాచారం. రైతు పాత్రలో నాని కనిపించనున్నాడని తెలిసింది. తనకి కొత్త కథ, కొత్త రోల్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. 14 రీల్స్ బ్యానర్ పై నిర్మితంకానున్న ఈ మూవీ పనులు వేగం అందుకున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus