ఆకట్టుకుంటున్న నాని ‘జెర్సీ’ టీజర్..!  

  • January 12, 2019 / 07:23 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘జెర్సీ’ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రద్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ‘అనిరుధ్’ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఇక ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా అర్జున్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ‘నీ ఏజ్ ఇప్పుడు థర్టీ సిక్స్(36) అర్జున్.. అది ప్రొఫషనల్ స్పోర్ట్స్ నుంచీ రిటైర్ అయ్యే ఏజ్’ అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతూ…
‘పిల్లలిని ఆడించే వయసులో… మనకి ఆటలేందుకు బావ’


‘ఆపేసి ఓడిపోయినవాడున్నాడు గానీ.. ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేదు’.. వంటి ఇన్స్పిరేషనల్ డైలాగులతో ‘జెర్సీ’ టీజర్ ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో వచ్చిన ‘ఎం.ఎస్.ధోని’ చిత్రం ఛాయలు కొంచెం కనిపించినప్పటికీ.. టీజర్ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. అనిరుథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా వచ్చింది. గతేడాది ‘కృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ చిత్రాలతో నిరాశ పరిచిన నాని… ఈ చిత్రంతో హిట్టందుకునేలా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని.. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 19 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus