ఎందుకు నవదీప్ ఇలాంటి చీప్ సినిమాలు చేస్తావ్

  • October 7, 2019 / 11:20 AM IST

ఒక స్టార్ హీరో అవ్వడానికి కావాల్సిన అన్నీ లక్షణాలు ఉండి కూడా అదృష్టం కలిసి రాక నిలదొక్కుకోలేకపోయిన కథానాయకుల్లో నవదీప్ ఒకడు. ఆఖరికి సహాయ పాత్రలు చేయడం మొదలెట్టినా కూడా అతడి కెరీర్ కి అవి పెద్దగా తోడ్పడలేదు. “బాద్ షా, ఆర్య 2, ధృవ” వంటి చిత్రాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ పోషించినప్పటికీ.. కెరీర్ పెద్దగా పుంజుకోలేదు. దాంతో.. సినిమాల మీద మాత్రమే ఆధారపడకుండా సొంతంగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు. మళ్ళీ చాన్నాళ్ల తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అల వైకుంఠపురములో” చిత్రంలో సహాయ పాత్రలో కనిపించనున్నాడు.

అయితే.. నవదీప్ ఉన్నట్లుండి తాను “రాగిణి ఎం.ఎం.ఎస్” సెకండ్ సీజన్ లో నటిస్తున్నానని నిన్న తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా ప్రకటించాడు. బాలీవుడ్ లో లస్ట్ కంటెంట్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి ఆల్ట్ బాలాజీ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సిరీస్ లో నవదీప్ కీలకపాత్ర పోషిస్తుండడం పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పోయి పోయి ఇలాంటి బీగ్రేడ్ సిరీస్ లో యాక్ట్ చేయడం ఎందుకు అని అందరూ కామెంట్ చేస్తున్నారు. మరి నవదీప్ ఇలాంటి రిస్క్ ఎందుకు చేస్తున్నాడు అనేది అతనికే తెలియాలి.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus