నవీన్ పోలిశెట్టికి టాలీవుడ్ లో భారీ డిమాండ్

  • April 12, 2021 / 08:19 PM IST

“జాతిరత్నాలు” బ్లాక్ బస్టర్ హిట్ తో టాలీవుడ్ లో మరో యంగ్ స్టార్ గా దూసుకొచ్చారు నవీన్ పోలిశెట్టి. సినిమాలో ఆయన చూపించిన కంప్లీట్ యాక్టింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అల్లు అర్జున్ లాంటి స్టార్స్ సహా ఇండస్టీలో చాలా మంది ప్రశంసలు అందుకున్నారు నవీన్ పోలిశెట్టి. కరోనా పాండమిక్ టైమ్ లో థియేటర్ల నుంచి దాదాపు రూ. 65 కోట్లు గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది జాతిరత్నాలు సినిమా. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో యూఎస్ లో వన్ మిలియన్ డాలర్స్ రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సూపర్ హిట్ ను వన్ మ్యాన్ షో గా నడిపించిన హీరో నవీన్ పోలిశెట్టికి ఒక్కసారిగా టాలీవుడ్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. “చిచ్చోరే”, “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్రాలతో వరుస సక్సెస్ లు అందుకున్న నవీన్ .. “జాతిరత్నాలు” చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. వరుస విజయాలు ఈ యంగ్ హీరోకు స్క్రిప్ట్ డెసిషన్ మీదున్న పట్టును చూపిస్తున్నాయి. “జాతిరత్నాలు” సినిమా పబ్లిసిటీ కోసం నవీన్ పోలిశెట్టి చేసిన ప్రమోషనల్ వీడియోలు కూడా ఆడియెన్స్ కు సినిమాను బాగా రీచ్ అయ్యేలా చేశాయి.

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టికి పలు క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. పేరున్న నిర్మాతలు ఈ యంగ్ స్టార్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నవీన్ కు 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ గా ఉన్నట్టు సమాచారం. ప్రేక్షకుల్లో ఇప్పుడున్న క్రేజ్ కు, “జాతిరత్నాలు” సినిమా చేసిన కలెక్షన్స్ చూస్తే నవీన్ పోలిశెట్టి 5 కోట్ల రూపాయలు పారితోషికం తక్కువే అనేది ట్రేడ్ వర్గాల మాట. ప్రస్తుతం అమెరికాలో చిన్న బ్రేక్ లో ఉన్న నవీన్ పోలిశెట్టి…కొద్ది వారాల్లో ఇక్కడికి రాగానే తన కొత్త సినిమాలను ప్రకటించనున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus