2017 చివర్లో నయనతార రెండో పెళ్లి!

  • September 25, 2017 / 09:32 AM IST

ప్రభుదేవతో ఏడాదిన్నరపాటు చేసిన సహజీవనం అనంతరం రజనీకాంత్, ప్రకాష్ రాజ్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులందరూ కలిసి నయనతారను అతడి నుంచి విడదీసి ఆమెను మళ్ళీ సినిమాలవైపు మళ్లించిన విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. ఆ బాధ నుంచి నయనతార పూర్తిగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో రాణిస్తూ ఇప్పుడిప్పుడే మళ్ళీ నెంబర్ ఒన్ పొజిషన్ కి చేరువలో ఉన్న నయనతార మళ్ళీ ప్రేమలో పడి తనతో ఒక సినిమా చేసిన విగ్నేష్ శివన్ అనే డైరెక్టర్ తో ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న విషయం ఇప్పుడిప్పుడే చక్కర్లు కొడుతోంది.

అయితే.. ప్రభుదేవ విషయంలో జరిగిన తప్పు విగ్నేష్ శివన్ విషయంలో జరగకూడదని, ఇంకోసారి అందరిముందు పరువు పోగొట్టుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయిన నయనతార.. కుదిరినంత త్వరగా.. అంటే నవంబర్ ఎండింగ్ లోపు విగ్నేష్ ను పెళ్లాడేందుకు ప్లాన్ చేస్తోందట. ఆల్రెడీ సెటప్ కూడా దాదాపుగా పూర్తయిపోయిందని.. త్వరలోనే నయనతార అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తుందని.. అందుకే ఓపెన్ అయిపోయి విగ్నేష్ శివన్ తో కలిసి న్యూయార్క్ వెళ్ళిన ఫోటోలను ఇంటర్నెట్ లో కావాలనే రిలీజ్ చేయించిందని అనుకొంటున్నారు. చూద్దాం మరి నయన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus