నయనతార ఇంట్లో గొడవలకు కారణం ఏంటి ?

  • April 4, 2017 / 09:59 AM IST

నయనతార నటించే సినిమాలో భర్త పాత్రతో గొడవపడుతుందా? ఏంటి? ఆ హెడ్డింగ్ పెట్టారు… అని ప్రశ్నలు గుప్పించకండి. మేము చెప్పేది.. నిజ జీవితంలో జరిగే సంఘటనే. అవును శింబుతో ప్రేమాయణం సాగించి, ప్రభుదేవాతో పెళ్లి దాకా వెళ్లిన కేరళ కుట్టి కొంతకాలం క్రితం యంగ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లిచేసుకుంది. ఎవరైనా రహస్యంగా పెళ్లి చేసుకుంటారు. నయన తార మాత్రం సీక్రెట్ గా పెళ్లితో పాటు, కాపురం చేస్తోందని కోలీవుడ్ సినీ మీడియా ఇదివరకు కథనాలు ప్రచురించింది. పెళ్లి అయినట్లు పరిశ్రమలో తెలిస్తే అవకాశాలు తగ్గుతాయని అలా సీక్రెట్ గా ఉంచారని కూడా వెల్లడించింది. ఇప్పుడు అదే విషయంపై ఇద్దరికీ గొడవ వచ్చిందని చెన్నై లో వార్త షికారు చేస్తోంది.

ఇంకెంతకాలం మన పెళ్లి సంగతిని దాచాలి.. అందరికీ చెప్పేద్దామని  విఘ్నేశ్  పట్టుబడుతుంటే, నయనతార మాత్రం ఇంకొంతకాలం ఆగమని చెబుతుందంట. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ కూడా జరుగుతోందని కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సైన్ చేసిన సినిమాలు అన్ని కంప్లీట్ అయిన వెంటనే పెళ్లి విషయం రివీల్ చేద్దామని నయనతార చెప్పడంతో.. విగ్నేష్ అందుకు ఒకే చెప్పిన్నట్లు ఈ రోజు చెన్నైకి చెందిక ఓ పత్రిక వార్త ప్రచురించింది. డైరక్టర్ కదా హీరోయిన్ కష్టాలు ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus