హారర్ చిత్రానికి భారీ పారితోషకం అందుకున్న నయన్..!

  • April 21, 2016 / 01:22 PM IST

నూతన దర్శకుడు దాస్ రామస్వామి తెరకెక్కిస్తున్న తమిళ హారర్ చిత్రం ‘టిక్ టిక్ టిక్’. నయనతార ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. గతంలో వచ్చిన మాయ చిత్రంలో మాదిరిగానే.. ఈ చిత్రం కూడా భయంకర చీకటి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో కారు ఒకటి కీలక పాత్ర పోషించనుందట.

ఈ చిత్రం దాదాపు అవుట్ డోర్ లొకేషన్స్ లోనే షూటింగ్ జరుపుకోనుంది. సర్కుణమ్, హితేష్ జబక్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గాను నయనతార అక్షరాల రూ.రెండు కోట్ల రూపాయలను రెమ్యునేషన్ గా తీసుకుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  హరీష్ ఉత్తమన్ ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటించనుండగా, తంబి రామయ్య.. నయనతార తండ్రి పాత్రలో కనిపించనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus