వెంకీకి ముద్దు ఇవ్వనన్న నయనతార.!!

అందాల తార నయనతార చేస్తున్న పనులు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న సింగపూర్ లో సైమా వేదిక పై స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ని అవమానించి అతని అభిమానుల నుంచి చీవాట్లు తిన్న ఈ భామ గురించి మరో విషయం బయటికి వచ్చింది. మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న “బాబు బంగారం ” సినిమాలో నయన నటిస్తోంది.

టాకీ పార్టీ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ పాటను చెన్నైలో చిత్రీకరించేందుకు మారుతి ప్లాన్ చేస్తున్నారు. అయితే కేరళ కుట్టి తమిళ సినిమాలతో బిజీగా ఉండి. బాబు బంగారం కోసం ఐదు రోజులు కేటాయించలేక పోతోందని చిత్ర బృందం తెలిపింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది. “ఈ సినిమాలో వెంకటేష్ ని కౌగిలించుకుని, ముద్దు పెట్టుకునే సీన్ ఒకటి ఉంది. దానిని చెయ్యడానికి నయన నిరాకరించింది.

స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుందని మారుతి ఎంత చెప్పినా ముద్దు కాదు కదా, హగ్ చేసుకోవడానికి కూడా నో చెప్పింది” అని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు. ఇలా చేయడం వల్లే ఆమెను తెలుగు సినిమాల్లోకి ఎవరూ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం బాబు బంగారం తర్వాత కేరళ కుట్టీ తెలుగులో ఏ సినిమాకు సంతకం చేయలేదు. టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేందుకే ఈ పరిశ్రమకు చెందిన వారిని తరచూ అవమానిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus