వివాదాస్పదమైన నయనతార ముద్దు..!!

  • August 9, 2016 / 01:56 PM IST

లిప్ లాక్ లతో సెన్షేషన్ సృష్టించే బ్యూటీ నయనతార ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కుంది. జీవా తో ఆమె కలిసి నటించిన తమిళ చిత్రం “తిరుణాల్”. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై మంచి కలక్షన్ రాబడుతోంది. ఇందులో నయన్ ప్రాధమిక పాఠశాల టీచర్ గా నటించింది. బడికి వెళ్లిన తొలి రోజు చిన్నారులను మచ్చిక చేసుకోవడానికి చాకోలెట్ ఇచ్చి, తన బుగ్గ పై ముద్దు పెట్టించుకుంది. ఆ క్రమంలో ఓ విద్యార్థి నయనతార బుగ్గ పై కాకుండా లిప్ పై ముద్దు పెట్టి వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు.

అంతటితో ఆగకుండా ఆ పిల్లాడి తల్లి సినిమా చూసి వచ్చి ఆనందంతో తన కొడుకు నయనతారను ముద్దు పెట్టుకున్నాడని వీడియోతో  సహా పోస్ట్ చేసింది. ఇంకేముంది ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. చర్చకు దారి తీసింది. ఆ సీన్ ద్వారా దర్శకుడు ఏమి చెప్పదలుచుకున్నాడు? అంటూ కొందరు మహిళలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే సినిమాలో హీరోలను చూసి పిల్లలు తోటి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. పిల్లల్తో ఏకంగా లిప్ లాక్ పెట్టించడం ఎంత వరకు సమంజసం అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన వారు మాత్రం “ఆ సన్నివేశాన్ని మేము హాస్యం కోసం చిత్రీకరించాం, అందులో పిల్లాడి కోరికను మేము వెల్లడించ లేదు.. అతని అమాయకత్వాన్ని చూపించాం” అని సమర్ధించుకున్నారు. అయినా సామాజిక కార్యకర్తలు శాంతించడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus