సైరా నరసింహారెడ్డి షూటింగ్ డిలేతో నయనతారకి తిప్పలు

  • June 6, 2018 / 09:36 AM IST

నయనతారకి రామ్ చరణ్ తో ఇబ్బందులేముంటాయి. ఇద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించడం లేదు కదా అలాంటప్పుడు చరణ్ కారణంగా నయనతార ఇబ్బందులు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుందా అని ఆలోచిస్తున్నారా? హీరోహీరోయిన్లుగా కలిసి నటించడం లేదన్న మాట వాస్తవమే కానీ.. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న “సైరా నరసింహా రెడ్డి”లో నయనతార కథానాయిక అన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమా కోసం 50 రోజుల డేట్స్ ఇచ్చింది నయనతార. అందుకోసం భారీ రెమ్యూనరేషన్ అందుకొంది అది వేరే విషయం అనుకోండి.

అయితే.. సినిమా అనుకొన్నదానికంటే లేట్ అయ్యేలా కనిపిస్తుండడంతో ఇంకొన్ని డేట్స్ ను ఎలాట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవ్వలేను అని చెప్పలేక ఈ సినిమా కోసం వేరే సినిమాలు వదులుకోలేక నయనతార చాలా ఇబ్బందులు పడుతోందట. మరి ఈ ఇబ్బందులను గూర్చి నిర్మాత చరణ్ ఏం అంటాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus