సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రేమ వ్యవహారాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రభుదేవా తో పెళ్లి వరకు వెళ్ళినా.. చివరి నిమిషంలో అది కాస్త బెడిసికొట్టింది. ఆ తరువాత సినిమాలతో బిజీ అయిపోయింది నయన. రీసెంట్ గా ‘నానుమ్ రౌడీథాన్’ సినిమాలో నటించిన నయనతార ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కాని ఆ వార్తల్లో నిజం లేదని ఖండించారు. శింబు, ప్రభుదేవా విషయంలో జరిగినట్లుగా విఘ్నేశ్ విషయంలో జరగకూడదని చాలా గోప్యంగా ఉంటుంది. తాజాగా ఈ ఇద్దరికి బ్రేకప్ అయినట్లు తమిళ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విఘ్నేశ్ పెళ్లి చేసుకుందామని నయనతారను అడిగితే..ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని మూడు సంవత్సరాల తరువాత చేసుకుందామని చెప్పిందట. దీంతో వీరి మధ్య గొడవ జరిగి విదిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.