నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని..లది సూపర్ హిట్ కాంబో. ‘వీరసింహారెడ్డి’ ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో చూశాం. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘పెద్ది’ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన ‘వ్రిద్ధి సినిమాస్’ అధినేత వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని(NBK 111) నిర్మిస్తున్నారు. ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను వదిలారు.
1:31 నిమిషాల నిడివి కలిగిన ఈ గ్లింప్స్ ను గమనిస్తే.. ఈ సినిమా కథ 1993 నాటి బాంబే (ముంబై) బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని స్పష్టమవుతుంది. ‘ఓజి’ స్టైల్లో ఈ గ్లింప్స్ మొదలైంది.
తర్వాత బ్లాక్-ఔట్ఫీట్స్ లో బాలకృష్ణ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. సిగరెట్ స్మోకింగ్ స్టైల్, బైక్ నడుపుతూ గన్ తో ప్రత్యర్థుల పై దాడి చేయడం, అలాగే చేతికి ఇనుప గొలుసులతో వాళ్ళని చితక్కొట్టడం, అలాగే చివర్లో పొక్లెయిన్ (జెసిబి) ఎపిసోడ్ అంతా స్టైలిష్ గా డిజైన్ చేశారు.’ది కింగ్ ఆఫ్ ఖోస్(Chaos) ‘ అంటూ బాలకృష్ణకు బర్త్ డే విషెస్ చెప్పాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.
బాలయ్య శ్వాగ్ తో పాటు ఈ గ్లింప్స్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే సినిమాటోగ్రఫర్ ‘కాంతార’ ఫేమ్ అరవింద్ ఎస్ కశ్యప్ ISC విజువల్స్ హైలెట్ గా నిలిచాయి అని చెప్పాలి. కాకపోతే చాలా వరకు ఈ గ్లింప్స్ లో ‘ఓజి’ ఛాయలు కనిపించడం అలాగే టైటిల్ రివీల్ చేయకపోవడం కొంత నిరుత్సాహపరిచే అంశం. మీరు కూడా ఓ లుక్కేయండి :