నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో మాస్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.’NBK111′(NBK 111) వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అందుకు ప్రధాన కారణం బడ్జెట్ కోతలే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ అయితే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో ఉంది.
దానికి పేపర్ పైనే నెంబర్ భారీగా కనబడినట్టు చెప్పుకున్నారు. దీంతో ఆ సబ్జెక్టును పక్కన పెట్టి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయాలని డిసైడ్ అయ్యారు.
అందుతున్న సమాచారం ప్రకారం… మార్చి 6 నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట.హీరోయిన్ విషయంలో కూడా చర్చలు జరుగుతున్నారు. నయనతారని ఫిక్స్ అనుకున్నారు. ఆమెతో చర్చలు ఇంకా జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.హీరో బాలకృష్ణ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించారట. షూటింగ్ మొదలైతే గ్యాప్ లేకుండా బ్యాక్-టు-బ్యాక్ షెడ్యూల్స్‌తో పూర్తిచేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవుతుంది. మేకర్స్ కూడా ఆ టైమ్..కే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యి అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నారట.ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. అలాగే ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండబోతుంది అని టాక్. ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్న వెంకట్ సతీష్ కిలారు ఈ ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.