ఒకానొక ఇంటర్వ్యూలో స్టీవెన్ స్పీల్ బర్గ్ ను “మీ కొత్త సినిమా వర్క్ ఎంతవరకూ వచ్చింది?” అని ఓ మీడియా రిపోర్టర్ ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా స్పీల్ బర్గ్ “వర్క్ మొత్తం పూర్తయిపోయింది.. షూటింగ్ మాత్రమే పెండింగ్” అని జవాబిచ్చాడట. స్పీల్ బర్గ్ చెప్పిన సమాధానానికి షాక్ అవ్వడం రిపోర్టర్ వంతయ్యింది. “ఈయనేంటి ఇంత సింపుల్ గా సమాధానం చెప్పేశాడనుకొని అవాక్కయ్యాడు. ఇంతకీ స్పీల్ బర్గ్ అలా సమాధానం చెప్పడం వెనుక పెద్ద కారణమే ఉంది. స్పీల్ బర్గ్ అనే కాదు చాలా మంది సీనియర్ దర్శకుల ప్రకారం సినిమాకి ప్రీప్రొడక్షన్ వర్క్ అనేది చాలా కీలకం. అందుకే వాళ్ళందరూ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయితే 75% సినిమా పూర్తయినట్లేనని భావించేవారు.
బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ విధానం పాటించే దర్శకులు కొందరున్నారు. కానీ.. తెలుగులో మాత్రం బూతద్దం పెట్టి వెతికినా అలా ప్రీప్రొడక్షన్ వర్క్ మీద ప్రత్యేక శ్రద్ద పెట్టే దర్శకులు ఎవరూ కనిపించరు. కానీ.. ఓ షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ పర్ఫెక్ట్ ఫిలిమ్ మేకింగ్ ప్రొసెస్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచి ఆకట్టుకొనేందుకు సిద్ధమవుతున్నాడు. “వర, వైతరణి” వంటి వైవిధ్యమైన షార్ట్ ఫిలిమ్స్ తో నెటిజన్లను ఆశ్చర్యచకితుల్ని చేసిన విద్యాధ్ నాని “గామి” అనే ఫ్యూచర్ ఫిలిమ్ తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సన్నద్ధమవుతున్నాడు. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందనున్న “గామి” సినిమా బడ్జెట్ అక్షరాల 85 లక్షలు.
ఎక్కడ ఎలాంటి లొకేషన్స్ లో ఎప్పుడు షూట్ చేయాలి అనేది కంప్లీట్ ప్రిపేర్డ్ గా ఉన్న విద్యాధ్ నానికి కావాల్సిందల్లా మంచి నిర్మాత మాత్రమే. అందుకోసం నిర్మాతల వద్ద చేతులు కట్టుకొని.. వారికి అవగాహన లేని వైవిధ్యాన్ని అర్ధమయ్యేలా వివరించడం కంటే సినిమా మీద ఆసక్తి ఉన్న జనాల్ని ఫండ్ చేయమని కోరుతున్నారు విద్యాధ్ నాని & టీం. తెలుగులో మంచి సినిమాలు రావడం లేదని బాధపడే ప్రేక్షకులు మొదలుకొని.. సినిమా అంటే మాకు ప్రాణం అని భావించే జనాలు మినిమం 500 రూపాయల నుంచి తమకు కుదిరినంత సినిమాకి ఫండింగ్ గా ఇవ్వొచ్చు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాల కోసం www.karthikkultkreations.com ను క్లిక్ చేయండి. సో, డియర్ మూవీ లవర్స్ “గామి” రెగ్యులర్ షూట్ కి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఇప్పుడు మీ చేతిలోనే ఉంది.