‘సాహూ’ చిత్ర షూటింగ్ అద్భుతమంటున్న నీల్‌ నితిన్‌ ముఖేశ్‌..!

  • January 9, 2019 / 10:35 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ -సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహూ’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ కి జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ” సోమవారం సెట్‌లో చిత్రీకరణ అద్భుతంగా జరిగిందంటూ…. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ….. తన ఇన్‌స్టాగ్రామ్‌ మరియు ట్విట్టర్ ద్వారా చెప్పాడు. దీనితో పాటు ప్రభాస్‌, డైరెక్టర్ సుజిత్‌ లతో కలిసి తీసుకున్న సెల్ఫీ ని కూడా పోస్ట్ చేసాడు. ఇక ‘సాహూ’ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో జపాన్‌లో ఉన్న ప్రభాస్ అభిమానుల కోసం కొత్త ఫొటోలు, గ్రీటింగ్‌ కార్ట్స్‌ పంపాడట. ఇక ఇందులో.. “మీరంతా సంతోషంగా న్యూఈయర్‌ వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నా’’ అంటూ జపనీస్‌లో పేర్కొన్నాడట యంగ్ రెబల్ స్టార్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus