బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియన్ స్టార్ అయిపోయారు. ఆయనతో కలిసి నటించడానికి బాలీవుడ్ స్టార్స్ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న త్రి భాష చిత్రంలో హిందీ తారలు ఎక్కువమంది నటిస్తున్నారు. హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ ప్రభాస్ తో రొమాన్స్ చేస్తుండగా, నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా తలపడుతున్నారు. వీరిద్దరిపై మొదటి షెడ్యూల్ ల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తొలిసారి ప్రభాస్ తో కలిసి నటించడంపై తన అభిప్రాయాన్ని రీసెంట్ గా వెల్లడించారు. “ప్రభాస్‌తో పనిచేయటం గ్రేట్ ఫీలింగ్” అని ప్రభాస్ ని నితిన్ అభినందించారు. ఇంకా మాట్లాడుతూ.. “సాహో చిత్రంలో నా పాత్ర కోసం చాలా శిక్షణ తీసుకున్నా.
ఈ సినిమా కోసం బరువు పెరిగా. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో షూట్ చేస్తున్నప్పుడు భాషకు అనుగుణంగా హావభావాలు కూడా మార్చాలి. అలా చేయడం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను” అని నితిన్ చెప్పారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.