అమేజింగ్ హీరో, అమేజింగ్ స్క్రిప్ట్ – నీల్ నితిన్ ముఖేష్

  • February 20, 2018 / 08:07 AM IST

సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అభిమానుల అంచనాలకు మించి సినిమా ఉండాలని నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు ఖర్చుకి వెనుకాడడం లేదు. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. దీని తర్వాత చిత్ర బృందం దుబాయ్ కి వెళ్లనుంది. అక్కడి శివార్లలో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ని ఆధ్వర్యంలో ఈ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. ఇందులో విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అతను తాజాగా సినిమా, ప్రభాస్ ల గురించి కొన్ని అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.

జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అతను మాట్లాడుతూ “సాహోలో ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. ప్రభాస్ అమేజింగ్ హీరో. అతని లాగే సాహో స్క్రిప్టు కూడా అంతే అమేజింగ్ గా ఉంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్ట్ అద్భుతం. బాహుబ‌లి లాంటి భారీ సినిమాలో న‌టించిన ప్ర‌భాస్‌పై ఎన్నో అంచ‌నాలుంటాయి. ఆ అంచ‌నాల్ని అందుకునే లెవ‌ల్లో సినిమా ఉంటుంది. సాహో ఎవ‌రినీ నిరాశ‌ప‌ర‌చ‌దు . సినిమా సెట్స్‌లో ఉండ‌గా స్క్రిప్టును రివీల్ చేయ‌డం కుదరదు. అందుకే క‌థ చెప్ప‌లేను” అని అన్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus