ప్రభాస్ ని గట్టిగా ఎదిరించడానికి రెడీ అవుతున్న నీల్ నితిన్!

బాహుబలి లో భల్లాలదేవ గా రానా హీరో ప్రభాస్ కి పోటీగా నటించారు కాబట్టి ఆ సన్నివేశాలు అంత అద్భుతంగా వచ్చాయి. ఘన విజయాన్ని అందించాయి. అందుకే సినిమాలో హీరో మాత్రమే బలంగా ఉంటే సరిపోదు.. విలన్ కూడా అంతకు రెట్టింపు దృఢముగా ఉండాలి. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు నీల్ నితిన్ ముఖేష్. ఇతను సాహో సినిమాలో ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ గతనెల విజయవంతంగా పూర్తి అయింది. ఈ నెలలో రెండవ షెడ్యూల్ మొదలు కానుంది. అయితే ఈ గ్యాప్ లో రెస్ట్ తీసుకోకుండా రోజుకి 8 గంటల పాటు జిమ్ లోనే గడుపుతున్నాడు నీల్.

అతి కష్టమైన వ్యాయామం చేస్తూ కండలు పెంచుతున్నాడు. తాజాగా తాను వర్కౌట్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. భారీ కండలు తిరిగిన అతని దేహం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ కి విలన్ అంటే ఆ మాత్రం ఉండాలి అని చెబుతున్నారు. మరి ప్రభాస్ ఏ మాత్రం తక్కువ తినలేదు. అసలు మీడియా కంటికి కనిపించకుండా మరోసారి సిక్స్ ప్యాక్ తో అలరించడానికి కసరత్తులు చేస్తున్నారు. రోజురోజుకి అంచనాలు పెంచుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus