రామ్ కి జోడీగా నటించే అవకాశం అందుకున్న మాళవిక శర్మ.!

  • March 23, 2018 / 09:23 AM IST

వాణిజ్య ప్రకటనలతో బాగా పాపులర్ అయిన మాళవిక శర్మ.. రవితేజ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “నేల టిక్కెట్టు” లో మెడికల్ విద్యార్థిగా కనిపించనుంది. ఈ సినిమా చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే మాళవిక శర్మ మరో ఛాన్స్ అందుకుంది. గరుడ వేగా సినిమా ద్వారా ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిలో పడిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు

ఇప్పుడు హీరో రామ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం కొంతమంది పేర్లను పరిశీలించారు. “నేల టిక్కెట్టు”  సినిమా షూటింగ్ సమయంలో తన నటనతో మాళవిక ఆకట్టుకోవడంతో.. ఆమె పేరు డైరక్టర్ పరిశీలనకు వచ్చింది. దీంతో  కథ వినిపించడం, ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. నేల టిక్కెట్టు మూవీ రిలీజ్ అయిన తర్వాత మాళవిక ఇంకెన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus