స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొని ఉంది. నిన్న (శుక్రవారం) మూడు భారీ సినిమాలు రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. హను రాఘవపూడి, నితిన్ కలయికలో వచ్చిన లై, తేజ దర్శకత్వంలో రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి, బోయపాటి తెరకెక్కించిన జయ జానకి నాయక చిత్రాలు అన్ని హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతున్నాయి. ఓవర్సీస్ లో కూడా తెలుగు ప్రేక్షకులు వారికి ఇష్టమైన సినిమాను ప్రీమియర్ షో ద్వారా చూసారు. వీటిలో “నేనే రాజు నేనే మంత్రి” $140,833 కలెక్షన్లను రాబట్టి మొదటి స్థానంలో.. నితిన్ “లై” $50,623 వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచాయి.
ఇక చివరగా బోయపాటి దర్శకత్వం వహించిన “జయ జానకి నాయక” $8,535 లను సాధించి చివరి స్థానంలో నిలిచింది. బాహుబలితో అభిమానులను సంపాదించుకున్న రానా .. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఆ ఫ్యాన్స్ కి మంచి కానుక ఇచ్చారు. భారీ కలక్షన్స్ తో ఈ శుక్రవారం పోటీలో పై చేయి సాధించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.