Poorna Son: హీరోయిన్ పూర్ణ కొడుకు క్యూట్ గా ఉన్నాడుగా.. అమ్మ పోలికే అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా వరుస ఆఫర్లను సొంతం చేసుకున్న పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. పూర్ణ టాలెంట్ కు తగిన ఆఫర్లు వస్తుండటంతో సినిమా సినిమాకు ఆమె క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే తాజాగా పూర్ణ తన కొడుకుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

పూర్ణ కొడుకు క్యూట్ గా ఉన్నాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. పూర్ణ కొడుకు అచ్చం తల్లి పోలికే అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూన్ లో దుబాయ్ కు చెందిన ప్రముఖ బిజినెస్ మేన్ ను పూర్ణ పెళ్లి చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. పెళ్లైన కొన్ని నెలలకే గర్భం దాల్చిన పూర్ణ ఆ సమయంలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

కొన్ని నెలల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చిన పూర్ణ తాజాగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. పూర్ణ కొడుకు క్యూట్ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పూర్ణ ప్రస్తుతం ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తుండగా ఈ షో ఆమెకు మంచి పేరు తెచ్చిపెడుతోంది. పూర్ణ చేతిలో ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయని బోగట్టా.

పూర్ణ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని రాబోయే రోజుల్లో మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎలాంటి రోల్ ఇచ్చినా పూర్ణ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు. ఒకింత రిస్కీ రోల్స్ లో నటించడానికి కూడా ఆమె సిద్ధంగా ఉంటారు. పూర్ణ రేంజ్ మరింత పెరగాలని ఆమెకు మరిన్ని విజయాలు దక్కాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus