ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ట్రోల్ అనేది చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమా తారాలకు స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ కంటే ట్రోలింగ్ ఫేస్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. త్వరలోనే “హౌ టు ఫేస్ సోషల్ మీడియా ట్రోలింగ్ లేదా బుల్లీయింగ్” అనే బుక్ ను కూడా ప్రచురిస్తారేమో. ఇప్పుడు ఉన్నట్లుండి ఈ ట్రోలింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే.. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ కి తాజాగా ఇబ్బందిపడుతున్న క్యాండిడేట్ మన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.
మనోడి సినిమా “దొరసారి” జూలై 12న విడుదలకు సిద్ధంగా ఉంది. కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కి మంచి రెస్పాన్సే వచ్చింది కానీ.. హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండను మాత్రం జనాలు ఆడుకొంటున్నారు. ఆనంద్ హీరో మెటీరీయల్ కాదని, ఆ లుక్స్ బాలేదని భీభత్సంగా ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. ఇక మొన్న బాబు చేసిన ఒక వీడియోకి వచ్చిన మీమ్స్ కి లేక్కే లేదు. అయితే.. సినిమా విడుదలైన తర్వాత అన్నిటికీ సమాధానం చెబుతా అని ఆనంద్ దేవరకొండ తన ఫేస్ బుక్ పోస్ట్స్ ద్వారా చెబుతున్నప్పటికీ.. అది సాధ్యమా కాదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో.