పాపం.. అమలకు లింకులు పెడుతున్నారు!

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట  హీరోయిన్ అమలా పాల్‌, దర్శకుడు ఏఎల్‌ విజయ్‌. రెండేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. మరి, ఇంతలో ఏమైందో గానీ, ఇప్పుడీ జంట విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఏమిటో గానీ, ఈ విషయాన్ని గాసిప్ రాయుళ్ళు బాగా వాడుకుంటున్నారు.

రకరకాల గాసిప్ లు పుట్టిస్తున్నారు. అమలకు అత్తారింటిలో వేదింపులు వున్నాయని ఓ గాసిప్. ఆలాగే విజయ్ కి కూడా అమల క్యారెక్టర్ పై అనుమానం వుందని మరో గాసిప్. ఇంకాస్త ముందుకు వెళ్లి..  అమల, తమిళ్ కు చెందిన ఓ స్టార్ హీరోతో చాలా క్లోజ్ గా ఉంటుందని, ఇది నచ్చక విజయ్ ఇక అమల వద్దనుకున్నాడని.. ఇలా ఎవరి ఇష్టం వచ్చిననట్లు వారు గాసిప్ లు వండేస్తున్నారు. అమల, విజయ్.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ విషయంపై క్లారిటీ ఇస్తే గాని ఈ గాసిప్ లకు తెరపడేట్లు కనిపించడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus