మళ్ళీ చిరు సినిమాలో కొత్త ట్విష్ట్!!!

  • August 6, 2016 / 10:08 AM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడు అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. అయితే దాదాపుగా ఎన్టీఆర్, నాగేశ్వర రావు తరువాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోగా చిరుకి మంచి పేరు అయితే వచ్చింది. అదే క్రమంలో 10ఏళ్ల ముందు అంటే ఆయన శంకర్ దాదా జిందాబాద్ తీసిన తరువాత ఏమయిందో ఏమో కానీ, సడన్ గా పార్టీ పెట్టేసి, ప్రజల్లోకి వచ్చేసి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోలేక చివరకు పార్టీని విలీనం చేసేసి మళ్లీ ముఖానికి రంగు వేసుకునేందుకు సిద్దం అయిపోయాడు.

ఇదిలా ఉంటే చిరు 150వ సినిమాపై సామాన్య ప్రేక్షకుడిలో పెద్దగా అంచనాలు లేకపోయినా దాదాపుగా 30ఏళ్ల బట్టి చిరుని చూస్తున్న అభిమానులకు మాత్రం పండగ అనే చెప్పాలి. వారి అంచనాలు తారస్తాయికి చేరడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందో అన్న ఆలోచనలో ఉన్నారు అభిమానులు. అయితే అదంతా పక్కన పెడితే, చిరు సెకెండ్ ఇన్నింగ్స్ అనుకున్నంత బాగా లేదు. ముఖ్యంగా సినిమా హీరోయిన్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు చిరు. నిన్న మొన్నటి వరకు మెగాస్టార్‌ సరసన నయనతార, అనుష్క, కాజల్‌.. ఇలా చెప్పుకుంటూ దాదాపుగా టాలీవుడ్ ను ఒక రౌండ్ వెసెసారు.

అయితే ఆ మద్య కాజల్ ని కన్ఫామ్ చేసినట్లు షూటింగ్ లో కూడా కాజల్ పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. ‘కత్తి’ రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలుసుకున్న దీపిక కూడా ఈ చిత్రంలో నటించేందుకు పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది. అంటే ఈ మ్యాటర్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళింది. ఇలా చక్కెర్లు కొడుతూ మొత్తానికి షూటింగ్ కు ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉండడంతో చిరు అండ్ టీమ్ చాలా అన్ హ్యాపీగా ఉన్నారట. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus