నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!

  • August 14, 2020 / 02:55 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెలకు పెళ్లి కళ వచ్చేసింది. తనకు కాబోయేవాడితో నిహారిక నిశ్చితార్ధం జరుపుకుంది. కొద్దిరోజు క్రితం సోషల్ మీడియాలో నిహారిక తన ఫియాన్సీ ఫోటోలు షేర్ చేశారు. నిహారిక మెడలో తాళి కట్టనున్న ఈ అబ్బాయి ఎవరని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. నిహారికతో రొమాంటిక్ పోజులిచ్చిన ఆకుర్రాడు జొన్నలగడ్డ చైతన్య అని మీడియాలలో కథనాలు రావడం జరిగింది. గుంటూరు ఐజి అయిన జొన్నగడ్డ ప్రభాకర్ రావు కుమారుడే ఈ చైతన్య.

ప్రభాకర్ రావు కుటుంబంతో సన్నిత సంబంధాలున్న నేపథ్యంలో నిహారిక పెళ్లి ప్రయత్నాలలో ఉన్న నాగబాబు ఈ పెళ్ళికి పచ్చ జెండా ఊపారు. కాగా నేడు నిహారిక-చైతన్యల వివాహ నిశ్చితార్థ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో బంధుమిత్రుల సమక్షంలోక రాత్రి 8:00 గంటలకు నిహారిక-చైతన్యల నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ఇక ఈ వేడుకలో చిరంజీవి,అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్, ఉపాసన, ధరమ్ తేజ్ సందడి చేశారు. నిహారిక మరియు చైతన్యలను ఆశీర్వదించారు.

హీరోయిన్ గా ఒక మనసు సినిమాతో నిహారిక వెండితెరకు పరిచయం అయ్యారు. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలలో హీరోయిన్ గా నటించారు. ఓ తమిళ చిత్రంలో కూడా నిహారిక నటించడం జరిగింది. మెగాస్టార్ భారీ చిత్రం సైరా లో అతిథి పాత్ర చేసి మెప్పించారు. పింక్ ఎలిపెంట్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన నిహారిక ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కుచ్చి మరియు మ్యాడ్ హౌస్ సిరీస్ లు నిర్మించారు. హీరోయిన్ గా సక్సెస్ కానీ నిహారిక పెళ్ళికి రెడీ అయ్యారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

1

2

3

4

5

6

7

8

9

10

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus