పెళ్ళికి రెడీ అవుతున్న మెగా డాటర్ నిహారిక …?

‘ఢీ’ షోతో బుల్లి తెరకు పరిచయమయ్యి మంచి క్రేజ్ ఏర్పరుచుకుంది మెగా డాటర్ నిహారిక. తరువాత ‘ముద్దపప్పు ఆవకాయ’ వంటి వెబ్ సిరీస్ లతో కూడా ఆకట్టుకుంది. ఇలా వచ్చిన క్రేజ్ ను డబుల్ చేసుకోవాలని ఆశపడి.. సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2016 లో వచ్చిన ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం పెద్ద హిట్టవ్వకపోయినా.. నిహా నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అదే స్పూర్తితో తరువాత సినిమాలకి రెడీ అయ్యింది. అయితే ఈ క్రమంలో వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలింది.

ఇక ఎన్నో ఆసలతో పెట్టుకున్న ‘సూర్యకాంతం’ చిత్రంకూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇదే చిత్రం ప్రమోషన్లలో నిహారిక తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపిన సంగతి తెలిసిందే. తనకి ఇంట్లో వాళ్ళు మూడేళ్ళ వరకూ సినిమాలు చేసుకునే అవకాశమిచ్చారని.. ఈ లోగా తను సక్సెస్ అయినా లేకున్నా పెళ్ళి చేసేస్తామని చెప్పారని తెలిపింది. అయితే నిహారికకు ఇంట్లో వాళ్ళిచ్చిన సమయం కూడా పూర్తికావచ్చింది. నిహారికా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మూడేళ్ళవుతుంది. అయినప్పటికీ తన కోరిక మాత్రం తీరలేదు. అదేనండీ ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలన్న ఆశ. ఇక నిహారిక పెళ్ళికి సంబందించి… ప్రయత్నాలు కూడా ఇంట్లో వాళ్ళు మొదలు పెట్టేశారని… సన్నిహిత వర్గాల సమాచారం. ఏదేమైనా ఈ ‘ముద్దపప్పు ఆవకాయ’ భామ త్వరలోనే ‘పప్పన్నం’ పెట్టడానికి రెడీ అయిపోయిందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus