ఒక్క సినిమా చేసిందో, లేదో.. అదీ ఇంకా బయటకు కూడా రాలేదు.. అప్పుడే మెగా హీరోయిన్ నిహారికపై ఓ హాట్ న్యూస్ తెగ హల్ చల్ చేస్తోంది. తొలి సినిమా ఒక మనసు హీరో నాగశౌర్యతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతోందని, ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందన్నది ఆ వార్తల సారాంశం. వీటిపై ఆమధ్యే నాగశౌర్య స్పందించాడు. ఇప్పుడు నిహారిక కూడా అదే మాట అంటోంది.
‘సినిమాల్లోకి వచ్చేటప్పుడే ఇంట్లోవాళ్లు ఇలాంటి గాసిప్పులకూ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కాబట్టి పుకారు రావడం నాకేం షాకింగ్ గా అనిపించలేదు. నేనేంటో నాకు తెలుసు.. ఇంట్లో వాళ్లకు తెలుసు.. అందుకే కంగారేం పడడం లేదని’ రీసెంట్ గా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒక మనసు సినిమాపై తనకు పూర్తి భరోసా ఉందట.
ఈ సినిమా తప్పకుండా అందరి అంచనాలని రీచ్ అయ్యే విధంగా ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ‘రామరాజు గారు కథ చెబుతున్నప్పుడే నేనీ సినిమా చూసేశా. అంత బాగా చెప్పారు. చెప్పిన దానికంటే బాగా తీశారని’ ఈ మెగా హీరోయిన్ అంటోంది.