తమిళ చిత్రానికి సైన్ చేసిన నిహారిక

  • February 15, 2017 / 01:41 PM IST

యాంకర్ గా రాణించి, వెబ్ సీరీస్ లో ఆకట్టుకున్న మెగా ప్రిన్సెస్ నిహారిక  ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం ఆశించినంతగా విజయం సాధించకపోవడంతో మంచికథకోసం ఎదురుచూసింది. ఆరు నెలల కాలంలో అనేక కథలు విన్న మెగా బ్రదర్ డాటర్ కి తమిళ డైరక్టర్ చెప్పిన కథ నచ్చినట్లు తెలిసింది. విజయ్ సేతుపతి అనే డైరక్టర్ హీరోగా పరిచయం కావడానికి అద్భుతమైన కథను రాసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నిహారిక సూటవుతుందని భావించి కొన్నిరోజుల క్రితం నాగబాబుకు కథ చెప్పారు.

ఆయనతో పాటు నిహారికకు కూడా స్టోరీ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. కోలీవుడ్ లో హిట్ సినిమా ద్వారా అడుగుపెట్టబోతున్నందుకు నిహారిక సంతోషంగా ఉందని ఆమె సన్నిహితులు వెల్లడించారు. ఈ సినిమా తెలుగులోనూ డబ్ చేయడానికి నాగబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయనే తెలుగురాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus