అందంగానే కాదు హుందాగానూ ఆకట్టుకొంటున్న మెగా డాటర్!

  • October 25, 2019 / 02:23 PM IST

మెగా ఫ్యామిలీ నుంచి డజను మంది హీరోలుండగా.. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నీహారిక కొణిదెల. కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది కానీ.. నటిగా మంచి మార్కులే సంపాదించింది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసినప్పటికీ.. ఎందుకో పెద్దగా అచ్చిరాలేదు. అలాగని నీహారికకు ఫ్యాన్ బేస్ లేకుండానూ లేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజస్ గట్రా బోలెడున్నాయి. “సూర్యకాంతం” ఫ్లాప్ తర్వాత నీహారిక మరో సినిమా సైన్ చేయలేదు. కంగారుపడాల్సిన అవసరం లేకపోవడంతో.. స్లోగానే కెరీర్ ప్లాన్ చేసుకొంటుంది. ఇటీవల “సైరా”లో అలా మెరిసి మాయమైంది.

అయితే.. ఇటీవల అమ్మడు కొత్త ఫోటోషూట్స్ తో నెటిజన్లను పలకరిస్తోంది. నీహారిక సారీ ఫోటోస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. చూడడానికి నిండు జాబిలమ్మలా ఉన్న నీహారికకు సరైన అవకాశం వస్తే బాగుండు అని ఫోటోలు చూసినవాళ్ళందరూ అనుకొంటున్నారు. మరి నీహారిక నెక్స్ట్ సినిమా ఏమిటో? ఆమె ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. ప్రస్తుతం నీహారిక ఒక వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేస్తోంది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిచేసుకోని టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus