నిఖిల్….అస్సలు ఊహించలేదట!!!

  • November 19, 2016 / 10:51 AM IST

టాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు చాలా కష్టంగా మారింది….సినిమాలు చాలావరకూ షూటింగ్ ఆపేసి కూర్చున్నారు…ఇంకా చెప్పాలి అంటే విడుదలైన సినిమాలకు కనీసం పార్కింగ్ వసూళ్లు కూడా రాకపోవడంతో సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందులో పడింది. ఇదిలా ఉంటే హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ నిఖిల్ ఇప్పటికే విభిన్నమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే..అయితే నిన్న విడుదలైన ఈ కుర్ర హీరో సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ మంచి టాక్ తెచ్చుకోవడంతో….నిఖిల్ ఆనందానికి హద్దులు లేవట.

అసలే పెద్ద నోట్లు రద్దు అయిన సమయంలో సినిమా చూడటానికి ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇంత క్లిష్ట సమయంలో కూడ తన సినిమా చూడటానికి వచ్చిన అభిమానులను చూసి కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు హీరో నిఖిల్ . అయితే అదే ఆనందంలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పెద్ద నోట్లు రద్దు కావడం చిన్న నోట్లు అంతగా లభించని కష్టకాలంలో తన సినిమా చూడటానికి వచ్చిన జనాలను చూసి  నిఖిల్ ఉద్వేగానికి లోనయ్యి….తన అదృష్టానికి పొంగిపోతూ మీ అభిమానం తో నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయని ట్వీట్ చేసాడు…అయితే సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్స్ వస్తాయి అని ఆశిద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus