ప్రభాస్ తనకి ఏ విధంగా సాయం చేశారో చెప్పిన నిఖిల్.!

  • April 20, 2018 / 12:17 PM IST

వినూత్నమైన కథలతో వరుసగా విజయాలను అందుకుంటున్న హీరో నిఖిల్… యువ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో చేసిన మూవీ కిరాక్ పార్టీ. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థపై సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ చిత్రం నిఖిల్ కి మరో హిట్ ని అందించింది. ఈ సినిమాలోని “ప్రాణమంతా” సాంగ్ అత్యంత ఎత్తైన గంగోత్రి కొండల్లో షూట్ చేశారు. అది సముద్ర మట్టానికి 13,500 ఎత్తులో ఉంటుంది. అక్కడికి బైక్స్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు తీసిన ఫోటోని రీసెంట్ గా షేర్ చేస్తూ.. ఆ రోజు జరిగిన సంఘటనని నిఖిల్ గుర్తుచేసుకున్నారు. “మేము సాంగ్ షూటింగ్ కోసం గంగోత్రి జలపాతాలవద్దకు వెళ్ళాము.

అక్కడి ఆర్మీ అధికారులు షూటింగ్ చేయొద్దని అడ్డుకున్నారు. అప్పుడు నేను సార్ .. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము అనగానే అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంకా నేనేమి చెప్పే పని లేకుండానే .. “ఓ మీరు బాహుబలి హీరో ప్రభాస్ సొంతఊరు నుంచి వచ్చారా? అయితే షూటింగ్ చేసుకోమని అనుమతి ఇచ్చారు. అంతేకాదు మాకు వాటర్ బాటిల్స్, ఫుడ్ అందజేశారు” అని వెల్లడించారు. “అందుకే హ్యాట్సాఫ్ ప్రభాస్ అన్న.. రాజమౌళి గారు” అంటూ నిఖిల్ కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎంత పాపులర్ అయ్యారో అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus