ఒక ఏడాది క్రితమే నిఖిల్ పెళ్లి హైద్రాబాద్ కు చెందిన ఒక అమ్మాయితో ఫిక్స్ అయ్యి.. అనంతరం కారణాంతరాల వలన క్యాన్సిల్ అవ్వడం తెలిసిందే. ఆ తర్వాత సినిమా మీద కాన్సన్ ట్రేట్ చేసిన నిఖిల్.. పర్సనల్ లైఫ్ లో వచ్చిన ఇబ్బందులను పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. ఈమధ్యకాలంలో నిఖిల్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. నటించిన “అర్జున్ సురవరం” ఎప్పుడు విడుదలవుతుందో ఇప్పటివరకు క్లారిటీ లేదు. త్వరలోనే అని నిఖిల్ అంటున్నాడు కానీ.. సినిమాకి చాలా అప్పులున్నాయని టాక్.
అయితే.. ఈలోపు పర్సనల్ లైఫ్ ను సెట్ చేసుకొన్నాడు నిఖిల్. తాను గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న డాక్టర్ ను పెళ్లాడాలని ఫిక్స్ అయ్యాడు. ఈమేరకు పెద్దలను కూడా ఒప్పించాడు. త్వరలోనే ఆమె ఎవరు అనేది నిఖిల్ స్వయంగా ప్రకటిస్తాడు. ఇకపోతే.. నిఖిల్ ప్రస్తుతం “కార్తికేయ 2” కోసం ప్రిపేర్ అవుతున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలవుతుంది.
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?