సీక్రెట్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న నిఖిల్ హీరోయిన్

“స్వామిరారా” చిత్రంలో కీలక పాత్ర పోషించిన పూజా రామ‌చంద్ర‌న్ ఆ సినిమాలో తన నటన కంటే వైల్డ్ అందాలతో ప్రేక్షకుల్ని ఎక్కువగా అలరించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో ముఖ్యపాత్రలు పోషించింది. అయితే బిగ్ బాస్ తో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ అమ్మడు తాజాగా మ‌రోసారి వివాహం చేసుకొని అంద‌రికి షాక్ ఇచ్చింది. స్వ‌త‌హాగా ఆర్జే అయిన పూజా రామ‌చంద్ర‌న్ తాను ప‌నిచేసే తమిళ ఎస్ ఎస్ మ్యూజిక్ ఛానెల్ కో ఆర్జే క్రెయిగ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం వరకు దారి తీసింది.

పెళ్లి అయిన కొన్నాళ్ళకు కలిసి ఉండలేమని నిర్ణయించుకున్న వారు విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత తెలుగులోను పలు చిత్రాలలో నటించిన జాన్ కొక్కెన్‌ అనే వ్యక్తితో పూజా సహజీవనం చేసింది. ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో తమిళ మీడియా కోడై కూసింది. అయితే అనీష్ జాన్ కొక్కెన్‌తో త‌న వివాహం కేరళ సాంప్రదాయంలో జరిగిందని పూజా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. అంతేకాదు త‌మ‌ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది పూజా రామచంద్రన్. అనీష్ జాన్ కొక్కెన్‌కి కూడా ఇది రెండో పెళ్లి. మొద‌ట మీనా వాసుదేవ‌న్ అనే న‌టిని వివాహం చేసుకున్నాడు జాన్‌. వీరి దాంప‌త్య జీవితానికి గుర్తుగా కొడుకు కూడా ఉన్నాడు. అయితే ప‌లు మ‌నస్ప‌ర్ధ‌ల వ‌ల‌న వారిరివురు విడాకులు తీసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus