Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Advertisement

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత రాజ్ అల్లాడకి(Raj Allada) అరుదైన గౌరవం దక్కింది. మొన్నామధ్య ‘నిలవే’ అనే చిన్న సినిమాతో ఈయన నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Raj Allada

ఇదిలా ఉండగా.. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2026-2028 కి గాను కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC)ని ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా నూతన రాజ్ అల్లాడ ఎంపికయ్యారు.

NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సంస్థను మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు, సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు మరియు సభ్యులతో అనుబంధాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని రాజ్ అల్లాడ తెలిపారు.

ఈ నూతన కార్యవర్గంలో రాజ్ అల్లాడతో పాటు వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్)గా రాజేష్ కండ్రు, వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్)గా అనుదీప్ అర్లా, వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్)గా రాజ్యలక్ష్మి చిలుకూరి, కార్యదర్శిగా సుధీర్ మిక్కిలినేని, ఖజాంచీగా రామ్ నరేష్ కొమ్మనబోయిన, జాయింట్ సెక్రటరీగా భాను లంక, జాయింట్ ట్రెజరర్‌గా వెంకట సాకమూరి బాధ్యతలు చేపట్టనున్నారు. వీరంతా వివిధ రంగాల్లో ఉన్నప్పటికీ NATS పట్ల అంకితభావంతో పనిచేస్తూ సంస్థ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చారు.

న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ రాజ్ అల్లాడ 2009 నుండి NATSలో వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు. సంస్థలో పలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే… పలుమార్లు NATS బోర్డ్ మెంబర్ గా వ్యవహరించారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, కమ్యూనిటీకి ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన తపన అందరికీ దగ్గర చేశాయి అని చెప్పొచ్చు.

మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus