​నాని కరియర్లో రాంగ్ స్టెప్!

  • June 19, 2017 / 07:06 AM IST

టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి ఇబ్బంది పెట్టే హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే వారిలో టాలెంట్ పెద్దగా లేకపోయినప్పటికే తమకు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ తో కాలం గడిపేస్తూ తామే పెద్ద హీరోలము అనుకుని బండి లాగించేస్తూ ఉన్నారు. అయితే ఇదిలా ఉంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలు చేసి, ఇంకా చెప్పాలి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి సొంత టాలెంట్ తో హీరోగా మారి న్యాచురల్ నటనకు ప్రాణం పోస్తున్న నటుడు నాని. అయితే అదే క్రమంలో ప్రస్తుతం నాని కరియర్ వరుస విజయాలతో మంచి పీక్స్ తో ఉండడం విశేషం. అంతేకాకుండా ఆ మధ్య కొన్ని పరాజయాలతో తికమక పడ్డ నాని ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ సినిమా నుండి తిరిగి ట్రాక్ పైకి వచ్చి డబల్ హ్యాట్రిక్ విజయాలను  సాధించడమే కాకుండా ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన ‘నేను లోకల్’ ఘన విజయంతో 35 కోట్ల హీరోగా మారి నాని కెరియర్ ప్రస్తుతం దూసుకు పోతోంది. ఇలాంటి పరిస్థుతులలో నాని తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి వచ్చేనెల ‘నిన్నుకోరి’ సినిమా ద్వారా ప్రయత్నిస్తున్నారు. కధ ఇంతవరకూ బాగానే ఉంది కానీ అసలు మ్యాటర్ ఇక్కడే మొదలయింది…అదేమిటి అంటే….ఇప్పటి వరకు వచ్చిన నాని ‘నిన్నుకోరి’ టీజర్ ను అదేవిధంగా ఈమూవీ ట్రైలర్ ను చూసిన కొంతమంది విశ్లేషకులు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మూవీ నాని ఇంతకుముందు చేసిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ను గుర్తుకు తెస్తోందీ అంటున్నారు. అదే క్రమంలో ఇలాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీలకు పాజిటివ్ టాక్ వచ్చినా మాస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడంతో వసూళ్లు భారీగా ఉండవు. ‘ఏటోవెళ్ళి పోయింది మనసు’ సినిమా విడుదలైన సమయంతో పోలిస్తే ప్రస్తుతం నాని రేంజ్ విపరీతంగా పెరిగిన నేపధ్యం వాస్తవమే అయినా ఈ క్యూట్ లవ్ స్టోరీకి భారీ కలక్షన్స్ ఎంత వరకు వస్తాయి అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అంటే ఏకంగా నాని ఈ మూవీని  సెలెక్ట్ చేసుకుని తప్పు చేశాడు అనేస్తున్నారు ఏకంగా…అయితే ఏది ఏమైనా…కధలో కాంటెంట్ ఉండాలే కానీ హిట్ ఆటొమ్యాటిక్ గా నడచి వస్తుంది అని తెలుసుకోవాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus