సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కాజల్!

టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ కెరీర్ కి ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ ఎసరు పెట్టింది. నిషా చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పి, పెళ్లి చేసుకుని సెటిల్ అయింది, ఆమె ఎలా కాజల్ కెరీర్ కి అడ్డు అవుతుంది అనుకుంటున్నారా?  అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. చెల్లెలు కాపురం చూస్తుంటే కాజల్ కి ముచ్చటేస్తుందంట. అంతేకాదు వివాహ వ్యవస్థ పై గౌరవం కలుగుతోందని మిత్రులకు చెప్పిందని సమాచారం. ఇలా నిషా అక్క కెరీర్ కి అడ్డు అయింది.

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మను కదిలిస్తే చాలు పెళ్లి గురించే మాట్లాడుతోందంట. “ప్రతీ వ్యక్తికీ జీవితాంతం తోడు ఉండగలిగే ఓ భరోసా అవసరం.. అది పెళ్ళితోనే దొరుకుతుంది” అని ఓ ప్రెస్ మీట్ లో చెప్పింది. అయితే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నటిస్తారా అని ఓ విలేఖరి ఆమెను అడిగితే ” పెళ్లయ్యాక కొత్త బాధ్యతలు వస్తాయి. కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు సినిమా కావాలా ? కుటుంబం కావాలా ? అనే ప్రశ్న తలెత్తితే ఖచ్చితంగా కుటుంబమే కావాలి అంటాను.

అటు సినిమాలు, ఇటు ఇల్లు చూసుకోవడం కష్టమే. అందుకే సినిమాలకు దూరం అవుతా.” అని స్పష్టంగా చెప్పింది కాజల్. శుభఘడియలు వచ్చే లోపున  వీలైనన్ని సినిమాల్లో నటించాలని ఆమె ఆరాట పడుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus