తల్లి కాబోతున్న మాజీ హీరోయిన్ నిషా అగర్వాల్!

క్రేజీ కథానాయకి త్వరలోనే ఓ బిడ్డను చంకనెత్తుకొని మురిసిపోనుంది. ఆ బిడ్డ మరెవరో కాదు స్వయానా మన కాజల్ కి స్వీట్ సిస్టర్ అయిన నిషా అగర్వాల్ కి పుట్టబోయే బిడ్డ. అవునండీ.. కాజల్ అగర్వాల్ సిస్టర్ మరియు ఎక్స్ హీరోయిన్ నిషా అగర్వాల్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని నిషా అగర్వాల్ స్వయంగా తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వెల్లడించింది.

నాలుగేళ్ళ క్రితమే తన చిన్ననాటి స్నేహితుడు కరణ్ ను ప్రేమించి పెళ్లాడిన నిషా అగర్వాల్ లాస్ట్ 4 ఇయర్స్ లో టూర్స్ అండ్ ట్రావెలింగ్ తో బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పటికే బాగా లేట్ అయిన విషయాన్ని గమనించిందో లేక.. మాకో బిడ్డను కనివ్వు అని అత్తింటివారు ఏమైనా ఫోర్స్ చేశారో తెలీదు కానీ.. ఉన్నట్లుండి ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. ఆ విధంగా కాజల్ అప్పుడే పిన్ని కూడా అయిపోయింది. ఇప్పటికైనా కాజల్ తన పెళ్ళి విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకుంటే మంచిది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus