భయపడుతున్న ‘నితిన్’!!!

  • April 20, 2016 / 06:21 AM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు నితిన్. జయం సినిమాతో భారీ హిట్ కొట్టి, దిల్ సినిమాతో మాస్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి, సై అంటూ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేసి దాదాపుగా 10యేళ్ళలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే నితిన్ కరియర్ ఒక్కసారి తిరగేస్తే గత అయిదు ఏళ్లలో నితిన్ కు బాగా కలసి వచ్చింది అనే చెప్పాలి. ‘ఇష్క్’, ‘గుండె జారీ గల్లంతయ్యిందే’, ‘హార్ల్ ఎటాక్’ చిత్రాలతో మంచి ఫామ్ ఉన్నాడు నితిన్. ఇదిలా ఉంటే అదే క్రమంలో అక్కినేని వారసుడు ‘అఖిల్’ హీరోగా వచ్చిన ‘అఖిల్’ సినిమాను తెరకెక్కించి నిర్మాతగా చేతులు కాల్చుకున్నాడు. అయితే ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ..ఆ’లో నటిస్తున్న నితిన్ కు అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి.

ఇంతకీ అవేమిటంటే…నితిన్ ‘అ..ఆ’ చిత్రాన్ని మే6న విడుదల చేద్దాం అని అనుకున్నాడు, కానీ అదే రోజున తమిళ స్టార్ హీరో సూర ‘24’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాడు. పోనీ ఒక వారం గ్యాప్ తీసుకుని ఆ తరువాత శుక్రవారం విడుదల చేద్దామా అంటే…మహేష్ బాబు,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం మూడో వారంలో రిలీజ్ కాబోతుంది అదీ కష్టమే. ఇక్కడ ఇంకో ట్విష్ట్ ఏంటంటే…తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి చిత్రం కూడా మే నెలలోనే రిలీజ్ కి సిద్దంగా ఉంది. దీనితో ఇప్పుడు నితిన్ ఏం చెయ్యాలో అర్ధం కాక తలపట్టుకు కూర్చున్నాడు. ఇక ఇవన్నీ కాదు అనుకుని, ఒక నెల లేట్ అయినా పర్వాలేదు అని అనుకుని జూన్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు నితిన్ అండ్ టీమ్. చూడాలి మరి ఏం జరుగుతుందో…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus