పాత బాటలో నితిన్ ..హిట్ అందుకుంటాడా?

  • August 6, 2016 / 03:02 PM IST

యంగ్ హీరో నితిన్ “అ..ఆ”తో సూపర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయినా తదుపరి చిత్రం విషయంలో ఆలోచిస్తున్నాడు. హిట్ ట్రాక్ నుంచి కిందికి పోకూడదని కథల ఎంపికల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు. కొత్త కాంబి నేషన్లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. కిక్, రేసు గుర్రం వంటి యాక్షన్ సినిమాలు తీసిన దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు ఎదురుచూస్తున్నట్లు  తెలిసింది.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ధ్రువ సినిమాను తెరకెక్కిస్తున్న సురేందర్ .. తర్వాత చిత్రాన్ని నితిన్ తో తీయనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇందుకోసం నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి డైరక్టర్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. నితిన్ పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో జయం, దిల్, సై వంటి  ప్రేమ కథల్లో నటిస్తూ విజయాలు అందుకున్నాడు. తర్వాత యాక్షన్ హీరో అవ్వాలని తాపత్రయంతో బాడీ పెంచి ఫైట్లు చేశాడు. పది చిత్రాల అపజయాల ద్వారా ఆలస్యంగా మేల్కొన్న నితిన్ ఇష్క్, గుండె జారీ గల్లంతయిందే వంటి  ప్రేమకథలతో హిట్ అందుకున్నాడు. “అ..ఆ” కూడా ఫైట్స్ లేని సినిమానే.

అది కూడా విజయం సాధించింది. ఇలా స్మూత్ స్టోరీలను ఎంచుకుని కెరీర్ గ్రాఫ్ ని పెంచుకోకుండా .. యాక్షన్ దిశగా యువ హీరో అడుగులు వేయడాన్ని కొంతమంది సినీ ప్రముఖులు తప్పుపడుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించడంలో ఇబ్బంది లేదు కానీ.. యాక్షన్ సీన్లు కాస్త తక్కువ ఉండేలా ప్లాన్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇంతకీ నితిన్ ఏ కథతో ముందుకు రాబోతున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus