ఒకేసారి రెండు సినిమాలు మొదలెట్టనున్న నితిన్

Advertisement

“లై, చల్ మోహనరంగా, శ్రీనివాస కళ్యాణం” చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ అనంతరం కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు రెండు సినిమాల‌కు నితిన్ క‌మిట‌య్యాడు. వెంకీ కుడుములతో అనుకున్న సినిమా ఇంకా ప‌ట్టాలెక్క‌కుండానే.. ఇప్పుడు మ‌రో సినిమా ఒప్పుకొన్నాడు. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌నతో ఓ సినిమా చేసేందుకు ముందుకొచ్చాడు నితిన్. ఈ రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు నితిన్. క‌థ రాయ‌డానికి ఎక్కువ టైమ్ తీసుకున్నా కూడా దాన్ని తెర‌కెక్కించ‌డానికి మాత్రం చాలా త‌క్కువ టైమ్ తీసుకుంటాడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. మ‌న‌మంతా త‌ర్వాత పూర్తిగా క‌నిపించ‌డం మానేసిన ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు నితిన్ సినిమాతో మ‌ళ్ళీ ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నాడు.

మరి నితిన్ కి ఈ రెండు సినిమాలు హిట్ అయ్యి మళ్ళీ ఫామ్ లోకి తీసుకొస్తాయో లేదో చూడాలి. ఇకపోతే.. నితిన్ ఎప్పుడైనా ఒకదాని తర్వాత ఒక సినిమా చేసినప్పుడే హిట్ కొట్టాడు. “ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే” ఆ కోవకు చెందినవే. మరి నితిన్ మళ్ళీ తప్పు చేస్తున్నాడా లేక క్యాల్కిలేటడ్ రిస్క్ చేస్తున్నాడా అనేది త్వరలోనే తెలిసిపోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news