డైరెక్టర్ ఫిక్స్ అయిన టైటిల్ పట్ల విముఖత చూపిన నితిన్

డిసెంబర్ లో “భీష్మ” చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేస్తూనే.. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో “రంగ్ దే” సినిమాలకు సిద్ధమవుతున్నాడు నితిన్. అయితే.. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్, సిమ్రాన్ చౌదరీలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి “చదరంగం” అనే టైటిల్ ను ఫిక్స్ అయ్యాడు. సినిమా పి.ఆర్ టీం సహకారంతో అన్నీ మేజర్ మీడియా హౌజ్ లలో ఈ టైటిల్ ను ప్రచురించడం జరిగింది. అయితే.. నితిన్ కి మాత్రం ఈ టైటిల్ నచ్చలేదట. చంద్రశేఖర్ ఏలేటి స్క్రిప్ట్ మీద ఇష్టంతోపాటు.. ఆయనపై గౌరవం కూడా ఉన్నప్పటికీ.. టైటిల్ విషయంలో మాత్రం ఆయనతో ఏకీభవించలేకపోతున్నాడట. కథకి ఆ టైటిల్ సరిపోతున్నా.. వేరే టైటిల్ ఏదైనా ఆలోచించమని చెబుతున్నాడట నితిన్. మరి ఈ టైటిల్ కన్ఫ్యూజన్ ఎప్పటికీ తీరుతుందో చూడాలి.

nithin-with-chandrasekhar-yeleti

ఇకపోతే.. నితిన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న “రంగ్ దే” రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవ్వనుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. “ఇష్క్” తర్వాత పి.సి.శ్రీరామ్-నితిన్ కాంబినేషన్ ఈ సినిమాతో రిపీట్ అవ్వనుంది.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.