నితిన్ – సుకుమార్ సినిమాకి అడ్డుపడుతున్న అల్లు అరవింద్..!

  • February 9, 2019 / 10:48 AM IST

నితిన్ – సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే సుకుమార్ డైరెక్షన్లో కాదు తన బ్యానర్ అయిన ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థలో సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడన్న మాట …! సుకుమార్ శిష్యుడు పలనాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. గతంలో ఈ డైరెక్టర్ ‘కరెంట్’ ‘కుమారి 21 F’ చిత్రాల్ని తెరక్కించాడు. అయితే ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ చిత్రం ఇంకా మొదలు కాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి అసలు కారణం పరిశీలిస్తే … ఈ చిత్రానికి మొదటి నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరిస్తున్నాడు. అయితే అల్లు అరవింద్ కు ఈ కథ, కథనాలు నచ్చలేదంట. ఈ కారణంగానే ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదని స్పష్టమవుతుంది. సుకుమార్ కి… హీరో నితిన్ కి… సూర్యప్రతాప్ వినిపించిన కథ నచ్చింది.. అయితే అసలు డబ్బులు పెట్టే నిర్మాత కి నచ్చలేదు కాబట్టి… ఈ చిత్రాన్ని స్వయంగా సుకుమారే నిర్మించాలని చూస్తున్నాడట. అయితే దీని పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus