లవ్ స్టోరీకి డిఫరెంట్ టైటిల్ పెట్టిన నితిన్

  • June 21, 2018 / 05:36 AM IST

టాలీవుడ్ హీరోల‌లో పెళ్ళి కాని హీరోల‌లో నితిన్ ఒక‌డు. అయితే నితిన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క గాసిప్ వార్త కూడా రాక‌పోవ‌డం ఇక్క‌డ మ‌రో విశేషం. నితిన్ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.నితిన్ ప్ర‌స్తుతం సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో “శ్రీనివాస కళ్యాణం” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా త‌రువాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌ కు ఓకె చెప్పాడు నితిన్‌. “ఛలో” సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు.

ఈ సినిమాకు “భీష్మా” అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేశారు. అంతేకాదు “సింగిల్‌ ఫర్‌ఎవర్‌” అనేది ట్యాగ్‌ లైన్‌. ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మా పేరుతో లవ్‌ స్టోరి తెరకెక్కిస్తుండటంతో భీష్మాపై ఆసక్తి నెలకొంది.ఈ రెండు సినిమాల‌పై నితిన్ చాలా న‌మ్మ‌కంతో ఉన్నాడు. నితిన్ గ‌త సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అయిన సంగ‌తి తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus