తెలుగు చిత్ర పరిశ్రమలో మగవారి డామినేషన్ ఎక్కువ ఉంటుంది.. హీరోయిన్స్ పాత్రకు విలువ ఉండదు.. మహిళలను గౌరవించరు.. అని కొంతమంది నటీమణులు గతంలో టాలీవుడ్ పై విమర్శలు గుప్పించారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమపై నిత్యా మీనన్ ప్రశంసలు గుప్పించింది. తెలుగుతో పాటు దక్షణాది అన్ని భాషల్లో నటించిన ఈమె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ముక్కుసూటి అమ్మాయిగా పేరు దక్కించుకుంది. ఎంత పెద్ద హీరో గురించి అయినా, ఉన్నది ఉన్నట్లు చెప్పే ఈ భామ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” దక్షిణాది అన్ని భాషల్లోనూ నేను నటించాను.
కానీ తెలుగులో హీరోయిన్లకు దక్కే గౌరవం మరే భాషలోనూ దక్కదు” అని అభినందించింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు నిత్యామీనన్ పై మరింత అభిమానం పెంచుకున్నారు. ఆమె తెలుగులో జనతా గ్యారేజ్ తర్వాత ఏ మూవీకి సైన్ చేయలేదు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.