జయలలిత’ బయోపిక్ పై నిత్యా మీనన్ స్పందన ..!

  • January 18, 2019 / 09:49 AM IST

ప్రముఖ నటి, దివంగత నేత్రి తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా ‘ది ఐరన్ లేడీ’ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకురాలు ప్రియదర్శిని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తుంది. ఈ పాత్ర పై తాజాగా నిత్యమీనన్ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపింది.

నిత్యా మీనన్ మాట్లాడుతూ.. “జయలలితగారి పై ఉన్న అభిమానం, గౌరవమే నన్ను ఆమె పాత్రలో నటించేలా చేసింది.. ఆమె జీవితం గురించి తెలుసుకుంటుంటే ఆమె పై అభిమానం రెట్టింపు అవుతుంది.. నిజంగా రాజకీయాల్లో ఆమె సాధించిన విజయాలు ఇంకెవ్వరి వల్ల సాధ్యం కావు..” అంటూ నిత్యా మీనన్ పేర్కొంది.ఇక ఇటీవలే… జయలలిత పాత్రలో ఉన్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా… దీనికి మంచి స్పందన లభించింది. ఈ లుక్ లో నిత్యా మీనన్ అచ్చం జయలలిత లాగా కనిపిస్తూ ఆశ్చర్యపరిచింది. మరి ఈ పాత్రలో నిత్యామీనన్ నటన ఎలా ఉండబోతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus