ఆ హీరొయిన్ మహేష్ ను రిజక్ట్ చేసింది!

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా మంది హీరోయిన్లు అనుకుంటారు. తన పక్కన నటించే అవకాసం వస్తే ఎగిరి గంతేస్తారు. అయితే తాజాగా మహేష్ బాబుని ఓ హీరోయిన్ రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంత పని చేసిన ఆ నటి ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరు నిత్య మీనన్. నటిగా తనకంటూ.. ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న నిత్యకు, మహేష్ లాంటి స్టార్ హీరో సరసన అవకాశం వస్తే నటించనని చెప్పి షాక్ ఇచ్చింది.దర్శకుడు మురుగదాస్, మహేష్ ను హీరోగా పెట్టి తెరకెక్కిస్తోన్న సినిమాలో ఓ పాత్రలో నటించమని నిత్యను సంప్రదించారట.

అయితే తను మాత్రం ఆ సినిమాలో నటించలేనని వచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. నిత్య ఆ ఆఫర్ ను వదులుకోవడానికి కారణముంది. మహేష్ సరసన హీరోయిన్ గా కాకుండా సినిమాలో చిన్న రోల్ లో నటించమని అడిగారు. హీరోయిన్ గా చెలామణి అవుతోన్న నిత్య ఆ రోల్ లో నటించలేక రిజక్ట్ చేసిందట. నిత్య ఇలా చేయడం మొదటిసారి కాదు. గతంలో ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ వస్తే ప్రభాస్ ఎవరని అడిగింది. ఆ తరువాత తన తప్పు తెలుసుకొని సారీ చెప్పిందనుకోండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus