నెటిజెన్లను ఎడా పెడా వాయించేసింది

  • August 12, 2019 / 07:25 PM IST

టాలీవుడ్ లో హీరోయిన్ గానే కాకుండా.. నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మేనన్‌. టాలీవుడ్లో రాణించిన నిత్య ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అరంగేట్రం చేయడానికి రెడీ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రం ఈ ఆగష్టు 15 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో నిత్య మేనన్ తో పాటు విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, తాప్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జగన్‌ శక్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యామేనన్‌ ఓ ఫోటో షూట్లో పాల్గొంది. రెడ్‌ టాప్‌, బ్లూ జీన్‌స్ ధరించి చిరునవ్వు తో ఉన్న నిత్య ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ‘ఓ పక్క సొంత రాష్ట్రం కేరళలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఇలాంటి ఫొటోలు పోస్ట్‌ చేయడమేంటి అంటూ కొందరు నిత్య పై విమర్శలు చేస్తున్నారు.

దీనికి నిత్యమేనన్ ఘాటుగా జవాబిచ్చింది. ” బుద్ధిలేని వాళ్ళు చేస్తున్న ఆరోపణల పై ఇది నా స్పందన. గత కొన్ని రోజులుగా కేరళ వరదల గురించి నేనేమీ మాట్లాడటం లేదని.. సోషల్‌మీడియాలో కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా అలాంటి వ్యాఖ్యలకు నేను స్పందించను. అలా ఎందుకు మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అయితే నేను ఒక వీడియో చేసి పోస్ట్‌ చేద్దామనుకున్నా. అయితే, కేవలం కొన్ని విషయాలను మాత్రమే సోషల్‌మీడియాలో పంచుకుంటా. ఎవరో ఏదో అన్నారని నేను ఒక వీడియో పోస్ట్‌ చేస్తే, మీరు సంతోష పడతారు. ఆ తర్వాత మర్చిపోతారు. కానీ, అది కాదు చేయాల్సింది. ప్రస్తుతం పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అందుకోసం మేమంతా కలిసి సాయం చేయాలనుకుంటున్నాం. ఆ విషయం మీకు తెలీదు.

అయితే నేను సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆనందంగా ఉన్నానని అనుకుంటున్నారు. ఒక సినిమా ఒప్పుకొన్న తర్వాత ఆ చిత్ర ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనడం నా కర్తవ్యం. డబ్బుల కోసమే ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఎంజాయ్‌ చేస్తున్నానని కొందరు కామెంట్లు పెడుతున్నారు. సినిమా విడుదలకు ముందు తప్పకుండా ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. అందుకోసం ప్రత్యేకంగా ఏమీ చెల్లించరు. నన్ను విమర్శిస్తున్న వారందరినీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. కేరళ వరదల కోసం మీరు ఏం చేశారో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నకు నిజాయతీగా సమాధానం చెబితే, మరొకరిపై మీరు వేలెత్తి చూపించరు. ఎదుటి వారి పై వేలెత్తి చూపే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఇతరుల పట్ల గౌరవభావంతో ఉండండి’’ అంటూ ఓ రేంజ్లో మండిపడింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus