మరో సారి అభిమానులకు వివరించిన నివేదా థామస్!

  • October 16, 2017 / 11:18 AM IST

నివేదా థామస్ “జెంటిల్ మ్యాన్” సినిమాతో  తెలుగు వారికీ పరిచయమంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాదు మళ్ళీ నానితో నిన్నుకోరిలో జతకట్టి, యువ హీరోలు నివేదా కావాలని కోరుకునేలా చేసింది.  అలాగే ఎన్టీఆర్ తో  జై లవకుశ సినిమాలోను అద్భుతంగా నటించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండే నివేదాకి గూగుల్ చేసిన మిస్టేక్ ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే గూగుల్ లో నివేదా పుట్టిన రోజు అక్టోబర్ 15 ఉంది. దానిని చూసి అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

గతఏడాది నివేదా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. తన పుట్టినరోజు అక్టోబర్ 15 కాదని స్పష్టం చేసింది. ఆ విషయాన్నీ అందరూ మరిచిపోయారు. అంతేకాదు ఈ ఏడాది కాలంలో నివేదాకి అభిమానులు పెరిగారు. వారందరూ ఈ అక్టోబర్ 15 కి బర్తడే విషెష్ చెప్పారు, దీంతో మళ్ళీ నివేదా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. “నాకు విషెష్ చెప్పిన వారందరికీ థాంక్స్. అయితే నా పుట్టినరోజు అక్టోబర్ 15న కాదు, నవంబర్ 2న” అని తెలిపింది. సో ఇప్పటికైనా ఫ్యాన్స్ గుర్తించుకుంటారో, లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus